: మూగ జీవాల పట్ల సానియా మీర్జా మమకారం


మూగ జీవాల కోసం టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రాకెట్ (బ్యాట్) ను దానం చేసింది. రాకెటే కదా అని తీసి పారేయకండి. దానిపై తన విలువైన ఆటోగ్రాఫ్ చేసి జంతువుల హక్కులు, వాటి సంరక్షణ కోసం పాటుపడే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్ మెంట్ ఫర్ యానిమల్స్ (పెటా) సంస్థకు బహూకరించింది. దానిని వేలం వేయడం ద్వారా వచ్చే నిధులను జంతువుల సంరక్షణకు వినియోగించాలని కోరింది. ఈ రాకెట్ ను ఈబేలో వేలం వేయనున్నారు. ఔత్సాహికులు ఎవరైనా పోటీ పడొచ్చు.

  • Loading...

More Telugu News