: సమాచారమిస్తే 10లక్షల బహుమానం: ఎన్ఐఏ


బుద్ధగయ పేలుళ్లకు సంబంధించి ఎటువంటి సమాచారం, ఆచూకీ తెలియజేసినా రూ.10లక్షలు నగదు బహుమానంగా అందిస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. పేలుళ్లు జరిగి మూడు రోజులు కావస్తున్నా నిందితులకు సంబంధించి దర్యాప్తు అధికారులకు ఎటువంటి కీలక ఆధారాలూ లభ్యం కాలేదు. ఘటన జరిగిన రోజు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నా అతడి పాత్ర ఏమీ లేదని తేలడంతో వదిలేశారు. మళ్లీ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం వారికీ సంబంధం లేదని ఈ రోజు విడుదల చేశారు. పేలుళ్లు జరిగిన రోజు ఆలయం ప్రాంతం నుంచి రెండు మొబైల్ నంబర్లకు కాల్స్, మెస్సేజ్ లు అధికంగా వెళ్లినట్లు గుర్తించారని సమాచారం. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News