: హైదరాబాదులో భద్రత కట్టుదిట్టం: కమిషనర్


నగరంలో బోనాల పండుగ, రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. బుద్ధగయలో పేలుళ్ల అనంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి సూచనలు అందాయని కమిషనర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. జంటనగరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను, నిఘాను పటిష్ఠం చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News