: మాపై నమ్మకం పెరుగుతోందని... జేఏసీ కుట్రపన్నుతోంది: బీజేపీ
తెలంగాణ సాధన దిశగా బీజేపీ చేస్తున్న చిత్తశుద్ది ప్రయత్నాలపై ఆ ప్రాంత ప్రజల్లో కలుగుతున్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు టీజేఏసీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత విద్యాసాగరరావు ఆరోపించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాసమస్యలపై పోరాడడాన్ని జేఏసీ తప్పు పడుతోందని, అది సరికాదన్నారు. తమది రాజకీయ పార్టీ అని, ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శ్రద్ధవహించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు సూచించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తో చర్చించాలని డిమాండ్ చేశారు.