: విజయవాడలో సత్రం నేలమట్టం.. తప్పిన పెనుప్రమాదం
సికింద్రాబాద్ లో ఒక హోటల్ భవనం కుప్పకూలిన ఘటన మరవకముందే రాష్ట్రంలో అలాంటిదే మరో ప్రమాదం జరిగింది. విజయవాడ పంజ సెంటర్ లో ఉన్న రాంగోపాల్ సత్రం రాత్రి కుప్పకూలింది. ఒకరికి గాయాలయ్యాయని సమాచారం. సత్రంలో ఉండే ఐదు కుటుంబాల వారు ఊరికి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నగరపాలక సిబ్బంది శిధిలాల తొలగింపును చేపట్టారు. ఈ భవనం నిర్మించి 100 ఏళ్లు పూర్తయిపోయింది. దీనిని ఖాళీ చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మూడేళ్ల క్రితమే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.