: నైట్ షిఫ్ట్ అమ్మాయిలకు మాతృత్వం సమస్య


నేటి ప్రపంచంలో మహిళలు కూడా పురుషులకు సమానంగా పనిచేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. వారితో సమానంగా రాత్రి పూట కూడా పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇలా రాత్రిపూట పనిచేసే మహిళలకు మిగిలిన వారితో పోల్చుకుంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో మహిళలు కూడా షిప్టుల్లో పనిచేస్తున్నారు. అయితే ఇలా పనిచేసే వారిలో ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు మిగిలిన వారితో పోల్చుకుంటే నెలసరి ఇబ్బందులు 33 శాతం ఎక్కువగా ఉంటాయని, అలాగే సంతానలేమి సమస్యలు కూడా 80 శాతం ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తమ పరిశోధనలో కనుగొన్నారు. 1969 నుండి 2013 వరకూ మహిళలపై నిర్వహించిన అనేక అధ్యయనాల విశ్లేషణలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను నిర్ధారించారు.

సంతానలేమి, లేదా గర్భధారణ సమస్యలు రాత్రివేళ పనిచేసే వారిలో తక్కువగానే ఉంటాయని, అయితే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా విభిన్న వేళల్లో పనిచేసే వారికి కచ్చితంగా సంతాన లేమి ఏర్పడుతుందని తాము చెప్పడం లేదని, అయితే వేళ తప్పిన వేళ ఉద్యోగాలకు, వంద్యత్వానికీ స్పష్టమైన సంబంధం ఉందని మాత్రమే తాము చెప్పగలమని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News