: స్నోడెన్ కు ద్వారాలు తెరిచిన వెనిజులా


అమెరికా హుంకరింపులను లాటిన్ దేశం వెనిజులా భేఖాతరు చేసింది. అగ్రరాజ్యం రహస్యాలను ప్రపంచానికి బహిర్గతం చేసి ఆగ్రహానికి గురైన ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్స్ స్నోడెన్ కు వెనిజులా స్వాగతం చెబుతోంది. అరెస్టు భయంతో అమెరికా వీడి రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో తలదాచుకున్న స్నోడెన్.. భారత్ సహా పలు దేశాలను తనకు ఆశ్రయం కల్పించాలని కోరాడు. అయితే, వెనిజులా, బొలీవియా మినహా మిగతా దేశాలన్నీ అమెరికాకు భయపడి స్నోడెన్ విన్నపాన్ని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో వెనిజులా.. స్నోడెన్ కు ద్వారాలు తెరిచింది. స్నోడెన్ వినతి తమకు అందిందని, ఆయన ఎప్పుడైనా తమ దేశం రావచ్చని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తెలిపారు.

  • Loading...

More Telugu News