: 'సడక్ బంద్'కు అనుమతి లేదు: మహబూబ్ నగర్ డీఐజీ


తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన 'సడక్ బంద్' కు అనుమతి లేదని మహబూబ్ నగర్ డీఐజీ నాగిరెడ్డి తెలిపారు. రోడ్డు దిగ్భంధం అని ఎక్కడపడితే అక్కడ సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. రహదారిని దిగ్భంధిస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

బంద్ రోజు పరిస్థితిని జాగ్రత్తగా ఎదుర్కొనేందుకు పదివేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు చేసినట్లు డీఐజీ వివరించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News