: మనవడి మాటలకు స్పందిస్తున్న మండేలా
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా తన మాటలకు స్పందిస్తున్నారని ఆయన మనవడు ఎన్ డబా చెప్పారు. ఈ నెల 18న మండేలా జన్మదినమని ఆ రోజున వేడుకలు నిర్వహిస్తామని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, మండేలా ఆరోగ్యంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పందించింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. విషమస్థితి తొలగిపోలేదని ప్రకటించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా మాజీ అధ్యక్షుడు మండేలా గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.