: బొత్సకు రెండు నాల్కల ధోరణి తగదు: యాదవరెడ్డి


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు మరోసారి స్వంత పార్టీలోనే విమర్శలు ఎదురయ్యాయి. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని గతంలో వ్యాఖ్యానించిన బొత్స తాజాగా సమైక్యరాగం ఆలపించడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. బొత్స రెండు నాల్కల ధోరణి వీడాలని ఆయన హితవు పలికారు. పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అలా రెండు విధాలుగా మాట్లాడితే ప్రజల్లో తేలికభావం ఏర్పడుతుందని యాదవరెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News