: 24న శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో 'సడక్ బంద్'


తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తామని గడువు పెట్టిన కేంద్రం మాట మార్చిన నేపథ్యంలో, తెలంగాణ కార్యచరణ సమితి తమ కార్యాచరణను మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 24న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో ‘సడక్ బంద్’ నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రోజు దాదాపు పదివేల మందితో సడక్ బంద్ నిర్వహిస్తామని టీ జేఏసీ హైదరాబాదులో తెలిపింది. కాగా, అదే రోజు హైదరాబాదు- కర్నూలు జాతీయ రహదారిని టీ జేఏసీ దిగ్బంధించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News