: మల్లికా శెరావత్ పై అరెస్టు వారెంట్ జారీ
అశ్లీల నృత్యాల కేసులో బాలీవుడ్ శృంగారతార మల్లికా శెరావత్ పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆగస్టు 19న హాజరు కావాలంటూ వడోదర జిల్లా కోర్టు మల్లికను ఆదేశించింది. ముంబయిలోని ఓ హోటల్లో 2006 డిసెంబర్ 31 రాత్రి.. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అసభ్య నృత్యాలు చేసిందంటూ మల్లికపై బరోడా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరేంద్ర తివారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆమెతోపాటు ఆ ఫైవ్ స్టార్ హోటల్ యాజమాన్యంపైనా తన పిటిషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో శనివారం హాజరవ్వాలంటూ న్యాయస్థానం మల్లికకు కిందటివారం సమన్లు జారీ చేసింది. అయితే, ఆమె ఆ ఆదేశాలను భేఖాతరు చేయడంతో కోర్టు తాజాగా అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంలో మల్లిక ఇంతకుముందు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ తిరస్కరణకు గురైంది.