: బార్లలో మహిళలకు డ్రెస్ కోడ్


రెచ్చగొట్టే డ్రెస్సులతో బార్లలో మందుబాబులకు మందు అందించే మగువలు ఉంటే ఏమవుతుంది? అప్పుడప్పుడు పరిస్థితులు అదుపు తప్పవూ? పెద్ద ప్రమాదాలకూ అవకాశం ఉంది. ఇలాంటివి దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం బార్లలో మహిళా సర్వర్లకు డ్రెస్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. బార్లలో పనిచేసే మహిళలకు 21 ఏళ్లు నిండి ఉండాలి. పాంట్, పైజామా వేసుకోవాలి. టీ షర్టు కూడా వేసుకోవచ్చు. అలాగే సల్వార్ కమీజ్, దుపట్టా వేసుకోవడానికి అనుమతించింది. ఈ మేరకు నిబంధనలను నోటిఫై చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News