: వీరప్పన్ అనుచరుల ఉరిపై స్టే కొనసాగింపు


వీరప్పన్ అనుచరుల ఉరిపై స్టే కొనసాగింపు
స్మగ్లర్ వీరప్పన్ అనుచరులకు మరికొంత కాలం ఊరట లభించింది. వారికి ఉరిశిక్ష అమలుపై స్టే మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. ఈ రోజు వారి పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 
1993 ఢిల్లీ పేలుళ్ల కేసులో దోషి దేవింద్రపాల్ సింగ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇది మార్చాలని.. ఉరిశిక్షను తొలగించాలని కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టుకే చెందిన మరొక ధర్మాసనం విచారిస్తోంది. ఆరు నెలలలోపు ఈ పిటిషన్ పై తీర్పు వెలువడుతుందని భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో తీర్పు వచ్చే వరకూ వీరప్పన్ అనుచరుల పిటిషన్ ను పెండింగ్ లో ఉంచుతున్నామని తెలిపింది. అప్పటి వరకూ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News