: రాష్ట్ర ప్రజల కోసం ప్రధాని పదవినే వదులుకున్నా: బాబు
'వస్తున్నా.. మీకోసం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన అంతరంగాన్ని విప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న విషయం గ్రహించే ప్రధాని పదవిని సైతం వదులుకున్నానని తెలిపారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నేడు జరిగిన ఈ పుస్తకావిష్కరణకు బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినా.. రాష్టానికే ప్రాధాన్యత ఇచ్చానని ఆయన వెల్లడించారు. అధికారం అనేది ప్రజలకు సేవ చేసేందుకే అని, స్వార్థం కోసం ఉపయోగించుకోరాదని సూచించారు.