: కాంగ్రెస్, జగన్ పార్టీలకు హరీశ్ రావు ఘాటు హెచ్చరిక
అధికార కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటైన హెచ్చరికలు పంపారు. తెలంగాణను అడ్డుకుంటే ఆ రెండు పార్టీలకు పుట్టగతులుండవని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో నేడు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, కాంగ్రెస్ నేతలు తలోమాటా మాట్లాడుతూ వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుటిలయత్నాలకు పాల్పడినా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం తథ్యమని ఆయన బల్లగుద్ది చెప్పారు.