: బసవతారకం ట్రస్టుకు యువ పారిశ్రామికవేత్త భారీ విరాళం
కేన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందిస్తున్న బసవతారకం ట్రస్టుకు యువ పారిశ్రామికవేత్త, 'స్విన్' సంస్థల అధినేత ఎన్.టి. చౌదరి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. డల్లాస్ లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ముగింపు సభల సందర్భంగా చౌదరి.. సినీ నటుడు బాలకృష్ణకు విరాళం తాలూకు చెక్ ను అందించారు. కేన్సర్ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఈ నిధులను వెచ్చించాలని ఆయన బాలయ్యను కోరారు.