: చౌకగా ఆకాశ ప్రయాణం


విమాన శబ్ధం వినిపిస్తే చాలు, మనకు తెలియకుండానే మన కళ్లు నింగిని తాకుతాయి. చూపును దాటి వెళ్లే వరకూ కళ్లు విమానాన్నేచూస్తూ ఉంటాయి. చిన్నారులకు ఇదో మరపురాని విషయం. పెద్దయ్యాక కూడా కొందరిలో ఈ ఆసక్తి అలాగే ఉండిపోతుంది. జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణంచాలనే చిరు కోర్కె మనసులోకి చేరిపోతుంది.

అలాంటి కోర్కె తీర్చుకునే అవకాశం దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ కల్పిస్తోంది. మధ్య తరగతి వారు కూడా అందుకునే ధరలలో చాలా తక్కువకే విమాన ప్రయాణాన్ని బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆకాశ ప్రయాణానికి గరిష్ఠంగా ఆరువేల రూపాయలుంటే చాలు.

ఈ డిస్కౌంట్ పథకం మంగళవారం ప్రారంభమైంది. మొత్తం ఆరు రోజులపాటు కొనసాగుతుంది. అంటే వచ్చే ఆదివారం వరకూ ఎప్పుడైనా ప్రయాణ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ మీరు ఏ రోజున ఏ నగరానికి ప్రయాణించాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకుని అందుకు తగినట్లుగా రాను పోను టికెట్లను బుక్ చేసుకోండి. దూరాన్ని బట్టి 2,250 నుంచి 3,800 వరకు టికెట్ ధరలుగా జెట్ ఎయిర్ వేస్ నిర్ణయించింది. 

ఒక ఉదాహరణలో ప్రయాణ చార్జీలపై ఎంతశాతం తగ్గింపు లభిస్తోందో చూడండి. సాధారణంగా ఇదే జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి ప్రయాణ చార్జీ రూ.8,000. అదే ఈ డిస్కౌంట్ మేళాలో అయితే   రూ.2,850 చెల్లిస్తే చాలు. ముంబై నుంచి హైదరాబాద్ కు రూ.2250 మాత్రమే. ముంబై నుంచి విశాఖ నగరానికి మాత్రం రూ.3800 చెల్లించాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ ప్రతిరోజూ దేశంలోని 57 ప్రాంతాలకు 450 విమాన సర్వీసులను నడుపుతోంది. 

  • Loading...

More Telugu News