: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టారు!
మోసగాళ్ళ చేతిలో అమాయక నిరుద్యోగులు మోసపోయిన ఘటన మరొకటి చోటు చేసుకుంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన 1000 మంది విద్యార్థులకు ముంబయిలోని మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంస్థలో కొలువులు కల్పిస్తామంటూ కొందరు వ్యక్తులు నమ్మబలికారు. దీంతో, సదరు మోసగాళ్ళను గుడ్డిగా నమ్మిన ఆ విద్యార్థులు ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించారు. సొమ్ము చేతిలో పడిన తర్వాత ఆ వంచకులు పత్తాలేకుండా పోవడంతో నిరుద్యోలు లబోదిబోమన్నారు. వారం రోజులుగా వారివద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఈ బీటెక్, ఎంటెక్ విద్యార్థులు గుంటూరు అర్బన్ ఎస్పీ రమణకుమార్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ తక్షణమే విచారణకు ఆదేశించారు.