: మృతుల కుటుంబాలకు పది లక్షలివ్వండి: విజయమ్మ డిమాండ్


సికింద్రాబాద్ లో హోటల్ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, హోటల్ కుప్పకూలడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా, ఈ ఘటనలో ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News