: హోటల్ కుప్పకూలిన ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు
పలువురి ప్రాణాలను బలిదీసుకున్న సిటీ లైట్ హోటల్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు దాఖలైంది. అరుణ్ కుమార్ అనే న్యాయవాది ఈ విషయమై విచారణ జరిపించాలంటూ కమిషన్ ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. రెండు నెలల్లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లను ఆదేశించింది.