: చంద్రబాబు, ప్రభాకర్ లపై బ్రదర్ అనిల్ పరువునష్టం?


వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి భర్త, మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సోమయాజులు వెల్లడించారు. భూవివాదాలతో పాటు అనేక కుంభకోణాల్లో అనిల్ కు భాగం ఉందని బాబు, ప్రభాకర్ అసత్య  ఆరోపణలు చేస్తున్నారని, అందుకే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.

రక్షణ స్టీల్స్ లో వాటాలు, తాజాగా హెలికాప్టర్ కుంభకోణంలో పాత్ర ఉందంటూ పలు విధాలా ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తున్నారని సోమయాజులు అన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాబు తీవ్ర నైరాశ్యంలో కూరుకు పోయి ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ సోదరి షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణకు తట్టుకోలేకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సోమయాజులు అన్నారు. కాగా, బ్రదర్ అనిల్ పై బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ ఆరోపణలను క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పాస్టర్ జి. జాన్ ఖండిస్తూ, అవి నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News