: ప్రధానికి పదవికి మోడీ సరిపోడు: మాయావతి
ప్రధానమంత్రి పదవికి మోడీ తగినవాడు కాదని, అతనిది కుంచిత మనస్తత్వమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. లక్నోలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "ఓటేసే ముందు ఆలోచించండి. ప్రధాని పదవిని ఆశిస్తున్న వ్యక్తి ఉత్తరాఖండ్ విపత్తు సమయంలో కేవలం గుజరాతీల రక్షణకే పరిమితమయ్యాడు. అలాంటి వ్యక్తి ప్రధాని పదవిని నిజాయతీగా నిర్వహించలేడు. ఆ పదవికి జాతీయవాది, లౌకికవాది కావాలి" అని మాయావతి చెప్పారు. పనిలో పనిగా ప్రధానమంత్రి పదవికి తాను సైతం ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు. బీఎస్సీకి అధికారమిస్తే దేశంలో 60 ఏళ్లుగా ఇతర ప్రభుత్వాలు పాలించని రీతిలో పాలన అందిస్తామన్నారు. అదేం పాలనో? అని హాజరైన ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.