: కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలో నాటకీయ పరిణామాలు


కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతోంది. గతరాత్రి డీసీసీబీ ఎన్నికల అధికారి చంద్రశేఖర్ హఠాత్తుగా అదృశ్యమవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో జిల్లా కలెక్టర్ తదనంతర చర్యలు చేపట్టి, డీసీఎంఎస్ ఎన్నికల అధికారి రమేశ్ కు డీసీసీబీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.

కాగా, 
డీసీసీబీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తుండడంతో మరోవైపు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపించడంతో డీసీసీబీ సమావేశం మందిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

  • Loading...

More Telugu News