: వర్షం కారణంగా.. విండీస్-లంక మ్యాచ్ నేటికి వాయిదా
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య నిన్న జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఈ రోజుకి వాయిదా పడింది. నిన్న టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 60 పరుగులు చేసింది. అప్పటికే తుంపర్లుగా మొదలైన వాన ఒక్కసారిగా భారీ వర్షంగా మారిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ను నేటికి వాయిదా వేశారు. ఆదివారం ఆట నిలిచిన దగ్గర నుంచే ఈ రోజు ఆట కొనసాగుతుంది.