: ఇన్సులిన్‌తో పాలు పడతాయి


బాలింతల్లో పాలు పడేందుకు ఇన్సులిన్‌ ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చనుబాల ఉత్పత్తికి ఇన్సులిన్‌ బాగా ఉపయోగపడుతుందని దీనివల్ల పాలు బాగా పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయం గురించి పరిశోధించారు. ఈ పరిశోధనలో ప్రసవానంతరం బాలింతల్లో పాలగ్రంధులను ఇన్సులిన్‌ తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తేలింది. కొన్ని రకాలైన జన్యువుల్లో ఈ సందర్భంగా కలిగే మార్పులే ఇందుకు కారణమని తమ పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలిచ్చే తల్లుల్లో పాల తయారీ కణాల పనితీరుపై ఇన్సులిన్‌ ప్రభావం ఇంత ఎక్కువగా ఉంటుంది అనే విషయం గురించి చాలాకాలం క్రితం వరకూ తెలియలేదని, గ్లూకోజ్‌ వంటి చక్కెర పదార్ధాలు ఈ పాల కణాలకు అవసరం లేకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News