: హైదరాబాద్ కేంద్రంగా త్వరలో భారీ జ్యూయలరీ ప్రదర్శన


హైదరాబాద్ మరో భారీ ప్రదర్శనకు వేదిక కాబోతోంది. దేశంలో బంగారం వినియోగదారులు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. దీంతో భారతీయ సంప్రదాయ ఆభరణాలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చేందుకు జ్యూయలరీ ఆసియా పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ లో జరుగనుంది. దేశ విదేశాలకు చెందిన అనేక ఆభరణాలను ఇక్కడ ప్రదర్శిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 12 నుంచి 14 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో 20 వేల నుంచి కోటి రూపాయల వరకూ విలువ చేసే నగలు ఇందులో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమ కర్టెన్ రైజర్ కోసం నటి ప్రియాంకరావు ఆభరణాలు పెట్టుకుని అందరినీ అలరించింది.

  • Loading...

More Telugu News