: పోలీస్ స్టేషన్ కు చేరిన బంగారం కథ!
దొరికిన బంగారం పంపకంలో వచ్చిన తేడా వల్ల విషయం కాస్తా బయటకు పొక్కి చివరికి అందరూ పోలీసులకు చిక్కారు. అదిలాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్ నగర్ లో ఉపాధి కూలీలు త్రవ్వకాలు జరుపుతుండగా 300 బంగారు నాణేలు దొరికాయి. వాటిని స్వర్ణకారుడికి అందజేసి పంపకాలు జరుపుకుందామని నిర్ణయించారు. అయితే స్వర్ణకారుడి చేతి వాటంతో గొడవలు జరిగి విషయం బయటపడింది. మూడు నెలలు ఆలస్యంగా విషయం వెలుగులోకి రావడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వర్ణకారుడు, ఐదుగురు ఉపాధి కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.