: దేశవ్యాప్తంగా మొదలైన కార్మికుల సార్వత్రిక సమ్మె
కార్మికలోకం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మొదలైంది. నేడు, రేపు జరుగనున్న ఈ సమ్మె వల్ల జనజీవనం స్థంభించనుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రవాణా సేవలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. మొత్తం పది డిమాండ్లతో 11 కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఈ సమ్మె వల్ల 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల ఆర్ధిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని అంచనా. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనరాదని కేంద్రం విజ్ఞప్తి చేసినప్పటికీ వారు ఖాతరు చేయలేదు. దీంతో బ్యాంకింగు సేవలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.