: పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడి ఆందోళన
బుద్ధగయలో పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సె ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ఖండించడమే కాకుండా ఘటనపై వివరాలు అందించాలని శ్రీలంక విదేశాంగ శాఖ, భారత్ లోని శ్రీలంక హైకమిషనర్ ను ఆదేశించినట్లు అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. బుద్ధగయను ఏటా వేల మంది శ్రీలంక వాసులు సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రతా కోణంలో శ్రీలంక అధ్యక్షుడు స్పందించినట్లు తెలుస్తోంది.