: భవిష్యత్తులో ఆంధ్రా యాపిల్స్


సిమ్లా యాపిల్స్ చాలా పాప్యులర్. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినవే. అలానే, భవిష్యత్తులో ఆంధ్రా యాపిల్స్ కూడా అందరికీ తెలిసే రోజు.. నోరూరించే రోజు రానుంది. మన రాష్ట్రంలోనూ యాపిల్స్ పండించేందుకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్ర వేత్తలు నాలుగేళ్లుగా పరిశోధన సాగిస్తున్నారు. ఇందుకోసం వారు జమ్మూ విశ్వవిద్యాలయం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయాస్ తదితర సంస్థలతో కలిసి పరిశోధన సాగిస్తున్నారు.

సాధారణంగా యాపిల్ పంటకు కనిష్ట ఉష్ణోగ్రతలు అవసరం. యాపిల్ మొక్క పూత సమయంలో 30 రోజుల పాటు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా లంబసింగి, చింతపల్లి ప్రాంతాలలో ఈ ఉష్ణోగ్రత ఉంటున్నట్లు సీసీఎంబీ శాస్త్ర వేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలు యాపిల్ సాగుకు అనుకూలమని తేలడంతో ఇక్కడ మనగలిగే వంగడాల కోసం వారు కృషి జరుపుతున్నారు. అయితే, ఇప్పటికే అరకులోయ ప్రాంతాలలో కొన్ని రకాల యాపిల్ రకాలను ఐటీడీఏ సాగు చేస్తోంది. కానీ, వీటికంటే మెరుగైన, నాణ్యమైన యాపిల్ పండ్ల కోసం సీసీఎంబీ పరిశోధన సాగిస్తోంది. ఈ పరిశోధన త్వరగా పూర్తయ్యి ఆంధ్రా యాపిల్స్ మార్కెట్లోకి రావాలని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News