: ముర్రేపై బ్రిటన్ భారీ ఆశలు
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. ప్రపంచ నెంబర్ వన్, సెర్బియాకు చెందిన నొవాక్ జోకోవిచ్ తో బ్రిటన్ కు చెందిన ఆండీ ముర్రే అమీతుమీ తలపడనున్నాడు. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ముర్రే కంటే అతడి గెలుపు కోసం బ్రిటన్ ప్రజలే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, ముర్రే గెలిస్తే 77ఏళ్ల తర్వాత వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ బ్రిటన్ సొంతమవుతుంది. వాస్తవానికి ముర్రే గతేడాదే కప్పు కొట్టాల్సి ఉంది. కానీ, ఫెదరర్ చేతిలో పరాజయం కావడంతో అతడి కల నెరవేరలేదు.