: బీహార్ లోని బుద్ధగయలో వరుస పేలుళ్లు
బుద్ధగయలోని మహాభోది ఆలయం సమీపంలో ఈ రోజు వేకువ జామున తొమ్మిది వరుస పేలుళ్లు జరిగాయి. మొదటి పేలుడు 5:25 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. ఆ తరువాత వరుసగా మిగతా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయినట్టు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు, రెస్య్కు టీం చేరుకొని పరిశీలిస్తున్నారు. పేలకుండా వున్న రెండు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేసారు. ఎటువంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.అదృష్టవశాత్తు పేలుళ్లు సంభవించిన సమయం ఉదయం కావటంతో రద్దీ తక్కువగా ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది .