: శాన్ ఫ్రాన్సిస్కోలో ఏషియానా విమానం క్రాష్ లాండింగ్
దక్షిణ కొరియా సియోల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వస్తున్న ఏషియన్ ఎయిర్ లైన్స్ విమానం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కుప్పకూలింది. విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో విమానం నుంచి దట్టమైన పొగలు, మంటలు వెలువడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు, 61 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ బోయింగ్ 777 విమానంలో మొత్తం 291 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది .