: సార్వత్రిక సమ్మెతో స్థంభించనున్న భారత్


కార్మిక సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి ఆగిపోనుంది. ఫిబ్రవరి 20, 21 రెండు రోజుల పాటు జరనున్న ఈ సార్వత్రిక సమ్మె వల్ల 15 వేల నుంచి 20 వేల కోట్లు దేశం నష్టపోనుందని అసోచాం హెచ్చరించింది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం అధికంగా ఉండనుంది. 

బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనకుండా ఉండాలని ఇప్పటికే ఆర్ బీఐ ఆదేశించింది. కార్మిక హక్కుల ఉల్లంఘన, సామాజిక భద్రత, ధరల పెంపు వంటి పది డిమాండ్లతో కార్మిక సంఘాలు ఈ సమ్మె చేపట్టనున్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News