: కాంగ్రెస్ తెలంగాణను వాడుకుంటోంది: నాగం


కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను వాడుకుంటోందని బీజేపీ నేత నాగం జనార్ధన రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ లో శనివారం జరిగిన పధాదికారుల సమావేశంలో పాల్గొన్న నాగం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ చేసుకునే సమయం లోపే తెలంగాణపై ప్రకటన చేయాలని బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి డిమాండ్ చేశారు. లేనిచో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ పదవికి పోటీచేసేవారు అర్హత కోల్పోతారని నాగం హెచ్చరించారు. తెలంగాణ అంశం పార్టీ సొంత విషయం కాదని, ప్రభుత్వమే రోడ్ మ్యాప్ తయారు చేయాలని నాగం డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News