: జగన్ ను ఇరికించేందుకు ఎవరినైనా బలిచేస్తారు: అంబటి
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో ఇరికించేందుకు ఎవరినైనా బలిచేస్తారని అంబటి రాంబాబు ఆరోపించారు. నిన్న వైఎస్సార్సీపీలో మోపిదేవి సోదరుడు చేరిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముందే ఊహించామని అంబటి పేర్కొన్నారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, మోపిదేవి వెంకటమరణ అరెస్టుకు ముందు హైడ్రామా నడిచిందని అంబటి అన్నారు. ఆయనను అరెస్టు చేయబోమని చెప్పి కటకటాలవెనక్కి చేర్చారని తెలిపారు. మోపిదేవి చేసిన పాపమేంటి.. సబిత, ధర్మాన చేసిన పుణ్యమేంటి? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.