: అగస్టా కుంభకోణంపై జేపీసీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధం:కమల్ నాధ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్ నాధ్ వెల్లడించారు.
హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి షిండే క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్ పై స్పందించిన కమల్ నాధ్...ఆ విషయం పార్లమెంటులోనే తేలుతుందని చెప్పారు.
హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి షిండే క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్ పై స్పందించిన కమల్ నాధ్...ఆ విషయం పార్లమెంటులోనే తేలుతుందని చెప్పారు.
ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 72 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కమల్ నాధ్ తెలిపారు. అత్యాచార నిరోధక బిల్లు, ఆహర భద్రత బిల్లు, లోక్ పాల్ బిల్లు వంటి కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదం పొందుతాయని ఆయన చెప్పారు.