: అమెరికా స్వాతంత్ర వేడుకల్లో అపశృతి
అమెరికా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా లాస్ ఏంజిల్స్ సిమీవాలీ పార్కులో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు సుమారు 10 వేల మంది ప్రజలు హాజరయ్యారు. కాగా ఓ కార్యక్రమంలో ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి 39 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో 17 నెలల చిన్నారితో పాటు, 78 ఏళ్ల వృద్దుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో 12 మంది బాలలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.