: కేసీఆర్ పై హెచ్చార్సీని ఆశ్రయించిన రమ్య
టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఆయన బంధువు వేగులపాటి రమ్య మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే దళితనేత చింతా స్వామి నిర్వహించిన సభలో ఆమె కేసీఆర్ ను విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్లోని రమ్య ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేగాకుండా, రమ్య కేసీఆర్ కు క్షమాపణలు తెలపాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె నేడు హెచ్చార్సీని ఆశ్రయించారు. రమ్య ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ ఆగస్టు 8లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ కరీంనగర్ ఎస్ ఐని ఆదేశించింది.