: రామ్ చరణ్.. అమితాబ్ ను మరిపిస్తాడా..?


అలనాటి సూపర్ హిట్ సినిమా 'జంజీర్'లో అమితాబ్ బచ్చన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అమితాబ్ నటన ఆ సినిమాకే హైలైట్. ఓ రకంగా అమితాబ్ కు స్టార్ డమ్ అక్కడినుంచే మొదలైందని చెప్పుకోవాలి. ఆ సినిమాలో ఇన్ స్పెక్టర్ విజయ్ ఖన్నా పాత్రలో జీవించిన అమితాబ్.. 'యాంగ్రీ యంగ్ మేన్' బిరుదునూ అందిపుచ్చుకున్నాడు. అప్పట్లోనే ఈ సినిమా రూ.6 కోట్లు వసూలు చేసింది. తాజాగా 'జంజీర్'ను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు భాషల్లో నిర్మితమైన ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో 'తుఫాన్' పేరిట వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. కాగా, ఈ సినిమాలో చరణ్ ఎలా నటించాడన్నది ఆసక్తికరంగా మారింది. నట దిగ్గజం అమితాబ్ పోషించిన పాత్ర కావడంతో అందరి దృష్టి చరణ్ పెర్ఫార్మెన్స్ పైనే ఉంది. చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా మాత్రం చరణ్ నటన సూపర్ అంటున్నాడు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా కూడా ఆకట్టుకుంటుందని అన్నాడు. ఇక సినిమా గురించి చెబుతూ.. ఒరిజినల్ 'జంజీర్' కంటే దీంట్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News