: ఉత్తరప్రదేశ్ నుంచి మోడీ పోటీ?
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏదేనీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. 2014 లోక్ సభ ఎన్నిల ప్రచార కమిటీకి సారధిగా మోడీ నియమితులు అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో వెలుగు వెలిగిన బీజేపీ ప్రస్తుతం అవసాన దశలో ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అక్కడ పోటీ చేయడం వల్ల బీజేపీ మళ్లీ పుంజుకుంటుందని, పూర్వ వైభవం వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీని అక్కడ పోటీకి దింపాలని యోచిస్తున్నారట. బీజేపీ తరఫున మోడీయే ప్రధాని అభ్యర్థన్న ప్రచారం కూడా బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.