: గిన్నిస్ బుక్ లో రికార్డు కోసమే బాబు పాదయాత్ర: బొత్స
గిన్నిస్ బుక్ లోకి ఎక్కేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. మరోవైపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వెళ్తున్న నేతలు, చంచల్ గూడ జైలులో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దర్శించుకుంటున్నారని బొత్స ఎద్దేవా చేశారు.