: మాజీ ప్రపంచ సుందరిపై భర్త వేధింపులు
మాజీ ప్రపంచ సుందరి, నటి యుక్తాముఖి తన భర్త ప్రిన్స్ తులిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరచుగా తన్నుతు, వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సెక్షన్ 498ఎ వేధింపులు, సెక్షన్ 377 అసహజ శృంగారం కింద తులిపై ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తులి న్యూయార్క్ కు చెందిన వ్యాపారవేత్త. తన భర్త వేధింపులపై యుక్తాముఖి గతంలోనూ అంబోలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. యుక్తాముఖి 1999లో 20 ఏళ్లకే ప్రపంచసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత హిందీ, తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది.