: గ్రూప్ -1 ఇంటర్వ్యూ లకు హైకోర్టు పచ్చ జెండా
గ్రూప్ -1 నియామకాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నియామక పత్రాలను మాత్రం అభ్యర్థులకు ఇవ్వవద్దని న్యాయస్థానం సూచించింది. అలాగే గ్రూప్-1 ప్రశ్నా పత్రాల్లో దొర్లిన తప్పులపై నివేదికను కమిటీ ఎప్పటిలోగా పూర్తి చేస్తుందని హైకోర్టు ఏపీపీఎస్సీని ప్రశ్నించింది.