: ముంబైలో సరసమైన ధరలకే కూరగాయలు


ఎన్నికలు తరుముకొస్తుండడంతో నేతలకు ప్రజల కష్టాలు గుర్తుకొస్తున్నాయి. దీంతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై వాసులకు తీపి కబురు అందించింది. సరసమైన ధరలకే కూరగాయలను అందజేసేందుకు నడుంబిగించింది. కూరగాయలను రిటైల్ ధరలలో 30 శాతం తగ్గించి అమ్మనున్నట్టు ప్రకటించింది. ఇందుకు నగరం అంతటా 90 ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన ప్రభుత్వం, ఇప్పటికే 10 దుకాణాలను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. కేంద్రం ఆహారభద్రత బిల్లును ఆమోదిస్తున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే తాయిలం ప్రకటించడం విశేషం. మార్కెట్ సృష్టిస్తున్న కృత్రిమ కొరతతో ప్రభుత్వం కూరగాయల పంపిణీకి నడుం బిగించింది.

  • Loading...

More Telugu News