: సమైక్యంగా ఉంచితే 25 ఎంపీ స్థానాలు గెలుస్తాం: గంటా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించకుండా యధాతధంగా ఉంచితే 25 ఎంపీ స్థానాలను గెలుస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కనుక 15 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి, ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచేందుకు ఏ రకమైన త్యాగం చేయాల్సి వచ్చినా నిరభ్యంతరంగా చేస్తామని తెలిపారు. కలిసి ఉంటేనే కలదు సుఖమన్నట్టు, కలిసి ఉండగా సాధించని అభివృద్ధి విడిపోతే ఎలా సాధిస్తారని ప్రశ్నించిన గంటా, అవసరమైతే చివరి అస్త్రంగా రాజీనామాలు కూడా చేస్తామని తెలిపారు.