: వ్యాయామంతో ఒత్తిడి దూరం!


వ్యాయామం చేయడం వల్ల మనకు ఆరోగ్యంతోబాటు మానసికంగా కూడా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం వల్ల మెదడుపై పడే ప్రభావం గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.

వ్యాయామం వల్ల షుగర్‌ను అదుపులో ఉంచడమే కాకుండా అటు బీపీని కూడా అదుపు చేయవచ్చు అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో అందరిదీ ఒత్తిడితో కూడిన జీవితం. ఉరుకుల పరుగులతో కూడిన జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒత్తిడిని తట్టుకునే శక్తిని వ్యాయామం ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం చేస్తున్న వ్యాయామం మన మెదడు ఒత్తిడిని తట్టుకునేలా దాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తుందని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

మెదడుపై శారీరక శ్రమ చూపే ప్రభావాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎలుకలపై అధ్యయనం చేశారు. తరచుగా వ్యాయామం చేసే ఎలుకల మెదడులో ఆందోళనను నియంత్రించే భాగంలో ఉత్సుకతను అణచివేసే నాడీ కణాలు చురుగ్గా పనిచేస్తున్నట్టు తమ పరిశోధనలో వారు గుర్తించారు. అందువల్ల వ్యాయామం చేయడం వల్ల ఇటు ఆరోగ్యంతోబాటు అటు మన మెదడు కూడా ఒత్తిడి తట్టుకుంటుందన్నమాట.

  • Loading...

More Telugu News