: మన దేశంలో ఇంత మంది టెన్నిస్ అభిమానులా!


మనదేశంలో క్రీడలంటే క్రికెట్ ఒక్కటేననే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఓ నిజం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ కి అభిమానులు అమెరికా తరువాత మనదేశం లోనే అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. లండన్ లో ఇటీవల జరిగిన వింబుల్డన్ ను ప్రధాన వేదికగా చేసుకుని సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ ఈ సర్వే చేసింది. జూన్ 24 నుంచి వింబుల్డన్ పోటీలు ప్రారంభమయ్యాయి. కాగా జూలై 1 న క్వాలిఫైయర్స్ ను ప్రకటించారు. టోర్నీ ఆరంభం నుంచి క్వాలిఫయర్స్ ను ప్రకటించినప్పటి వరకూ టెన్నిస్ పై 11.6 మిలియన్ల సంభాషణలను అధ్యయనం చేశాక భారత్ కు చెందిన టెన్నిస్ అభిమానులు ద్వితీయ స్థానంలో ఉన్నట్టు ఫేస్ బుక్ ధ్రువీకరించింది. పురుషుల విభాగంలో నాదల్, ఫెదరర్ పై చర్చించిన నెటిజన్లు, మహిళల్లో షరపోవా, సెరీనాపై చర్చించారు.

  • Loading...

More Telugu News