: ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ రాజకీయంగా మారుస్తోంది: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని ఓటుబ్యాంకు రాజకీయంగా మారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ నరేంద్ర మోడీపై బురద జల్లేందుకు ఇష్రత్ జహాన్ కేసుకు కాంగ్రెస్ పార్టీ కొత్త భాష్యాలు చెబుతోందని మండిపడ్డారు. మోడీపై నిరాధార నిందారోపణలు చేస్తే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.